మనసొక మధుకలశం
Sunday, August 18, 2013
నా చరిత్రను నాకే తెలియనివ్వనంతగా చేసిందెవ్వరు
నా చరిత్రను నాకే తెలియనివ్వనంతగా చేసిందెవ్వరు ?
నా చరిత్రను నెను చదువుకునె అవకాశాన్ని నాకు తెలుగు పాటాలు కలిపించలేదు.
అట్లతద్దె గురించి చదివా గాని, బతుకమ్మ గురించిన పాట్యాంశంగా లేదు.
తెలుగు కవుల గురించి, వారి పద్యాలను చదివా గాని, ఎక్కడా తెలంగానా పాట లేదు, మాటలేదు, తెలంగానా కవుల ప్రస్తావన లేదు..
పల్నాటి పౌరుషాల గురించి రాసారు గాని, ఎక్కడా తెలంగాన సాయుధ పొరాటం గూర్చి చెప్పలెదు.
ఆంధ్రప్రదేశ్ అంటే "ఆంధ్ర" అనే భావనా?.. లెక తెలంగానా చరిత్ర పైన చిన్న చూపా?
వేముల వాడ భీమకవి, కాలొజీ, సురవరం ప్రతాప రెడ్డి, సుద్దాల హనుమంతు నా తెలుగు పాటాల్లో, పాటల్లో గాని కానరాలేదు.
కొమురంభీం, చాకలి ఐలమ్మ నా చరిత్ర పుస్తకాల్లొ ప్రచురణకు నోచుకొలేదు
వజ్రొత్సవాలు జరుపుకున్నాం, వందేల్ల సినిమా గురించి మాట్లాడుకుంటున్నా ము, కాని దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత, హింది సూపర్ స్టార్ తెలంగాన వాడైన ఫైడి జయరాజ్ గురించి మాట్లడామా? ఆసలు జయరాజ్ ఎంతమందికి తెలుసు?
ఇలా ఇంకెందరో తెలంగానా మహనీయులు తెలుగు చరిత్రలో గుర్తింపునకు దూరమయ్యారు.
ఎంతగా అంటె గూగుల్ కి కూడా దొరకనంతగా.
గూగుల్ లొ ఆంధ్రప్రదెశ్ కవుల గురించి వెదికినా, సినిమా గురిచి వెదికినా, ఆటగాల్ల గురించి గాని , ఇంకేది వెదికినా, తెలంగాన వాళ్ళు కనిపించరెందుకు ? t
తెలంగానాది బాషేకాదు అన్నప్పుడు.. తెలుగు భాషలొ తెలంగాన పదాలే లేనప్పుడు, తెలుగులో నా తెలంగానా ఎక్కడా కాన రానప్పుడు నేను తెలుగువాణ్ణా? లేక తెలంగానా వాణ్ణా ?
తెలంగానా ఎర్పడితే మా చరిత్రకు, సంస్క్రుతికి, పాటకు, మాటకు, బతుకుకు ఓ గుర్తింపు , గౌరవం వస్తుంది.. అలా కోరుకోవడం తప్పా ?
మా పొలాలకు నీళ్ళొస్తాయి, మా కలాలకి స్వేచ్చ వస్తుంది, అది కలగానే ఉండాలా ? నిజం కాకూడదా?
వలువలు నేసే చేనేతన్నకు బతుకు పైనా భరోసా వస్తుంది.. కొలువులొచ్చి తెలంగానా బతుకులకు విలువొస్తుంది..ఇలా ఆశపడడం అన్యాయం అవుతుందా ?
అణచివేత నుంచి, ఆకలి నుంచి, దోపిడి నుంచి విముక్తి కోసం, స్వపరిపాలన కోసం ఉద్యమాలు వస్తాయి, కాని అధిపత్యం చెలాయించడానికి ఎక్కడా ఉద్యమాలు పుట్టలేదు..
ఆధిపత్యం కోసం చేసేవి ఉద్యమాలు కాదు.. యుద్దాలు..
Sunday, December 23, 2012
Amith Radarapu
వాళ్ళను చంపేయండి .. వాళ్ళను నరికేయండి..
కళ్ళను పీకెయండి.. వేళ్ళను కొసేయండి..
నాలుకని తెగ్గోయండి..ఎలుకలతో మర్మాంగాలను చిద్రం చేయించండి..
నరాలను తెంపేయండి.. తరాలు గుర్తుంచుకునేలా శిక్షించండి సార్.
అదే ఇనుప రాడ్డుని . ....దిగేసి గొంతులోంచి తీయండి ..
అయినా చల్లారదేమో..
మరి మనకెందుకులె అనుకునే మనలాంటోల్లకు..? .. అదే శిక్ష వేయండి !!
ఓ అమ్మాయిని ... ఇనుప రాడ్డుతో.. వింటూనే వణుకు పుడుతోంది
ఇది క్రూరత్వమా.. పైశాచికమా .. శాడిజమా .. రాక్షసత్వమా
దాష్టీకమా .. కర్కశత్వమా ? ఏ పదాలతో ఫోల్చాలి.. ఇవేవీ సరిపోవు ..
దయచేసి మగాళ్ళను తిట్టకండి.. వాల్లది మగాళ్ళ జాతి కాదు.. మ్రుగాళ్ళజాతి
తూ... మ్రుగాలు కూడా ఇంత కర్కశంగా ఉండవు..
ఈ దొంగలం****** తిట్టడానికి బూతులు అయిపొయయి.. ఎవరైనా కొత్తగా కనిపెట్టండి.
మానవత్వం తగలడిపోతోందిరా.. కాసిన్ని నీళ్ళు చిలకరిస్తే సరిపోతుందా ?
ఈ నాయకుల ప్రసంగాల హొరులో ఆడదాని ఆర్తనాదాలు ఎక్కడ వినిపిస్తాయి ?
రక్షణ మా చేతుల్లో లేదు ఎస్కేపిజం.. భక్షణ మాత్రమేనా మీ పని
డ్రెస్సింగ్ సరిగా ఉండట్లేదు .. అమ్మాయిలు అదుపులొ ఉండాలి అని కొందరి నేతల ఉచిత సలహాలు
ఛీ... సిగ్గేయట్లేదా ? మళ్ళీ అత్యాచారం చేయడానికి ...
చార్జిషీటులొ ప్రభుత్వాలను చేర్చండి ప్లీజ్ ..
ఆసిడ్ మంటల్లొ ఆడడాని ఆశలన్నీ భుగభుగమని మండి పొతుంటే..
సర్జరీకి సాయం చేస్తాం ఆర్జీ పెట్టుకోమంటారు, పొలీసుల గస్తీ పెంచుతామంటారు..
సార్, పొలీసులు రేపులు చేసిన రోజులున్నాయండీ !!
మాకూ అమ్మయిలున్నారూ అంటున్నారు నేతలు .. చా .. ఊరుకోండి సార్ ..
మీకు ఇలాంటి ప్రాబ్లంస్ ఎందుకుంటాయి? . ఉంటే ఇలా స్తబ్దుగా ఉండేవారా ? ..
మీ అబ్బాయో .. మీ బామ్మరిదో ఈ కేసులో ఉండుంటే ఈ న్యూస్ మాదాకా వచ్చేదా ?
యువతిపై గ్యాంగ్ రేప్ .. అయిదేళ్ళ పాపపై అత్యాచారం..
ఆసిడ్ దాడి, గొంతుకోసి... హెడ్డింగ్స్ చూసి వదిలేస్తున్నాము
ఎంత కామన్ అయిపొయాయి మనకు ఈ దారుణాలు..
టీవీల్లొ ఐదు నిమిషాలు వీటిపై చర్చ చూసి.. ఎంటర్టైన్మంట్ చానల్ కోసం వెదుకుతాం
స్కొరెంతో అని అలొచిస్తాము ..
హొ "నేరాలు ఘోరాలు" కూడా .. మనకు ఎంటర్టైన్మెంట్ కిందకే వస్తాయి కదా.. టిఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాంస్ ఏముంటాయి మన మీడియాకి?
భరణి గారు అన్నరు ఇవాళా (సాక్షి లొ) ..
"నా టైర్లు పేలిపోతే బావుండనుకున్నాను! బ్రేకులు ఫెయిలైతే బావుండనుకున్నాను"
బస్ బ్రేకులు ఫెయిల్ అయినా .. ఆ అమ్మాయి బ్రతుకుని కాపాడడానికి మనుషులు ఎక్కడ బ్రతికున్నారు సార్ ?
పట్ట పగలు నడిరొడ్లపైనా దారుణాలు జరుగుంటే మాత్రం ఎవడు ఆపాడు.. ట్రయిన్ లో వెంటాడుతూ మరీ ఓ అమ్మాయిని బయటికి తొసేస్తే ఎవడేం పీకాడు.. రోడ్ల పైన బట్టలూడదీస్తుంటే ఫొటొలు తీసుకునే కల్చర్ సార్ మనది
చెడు వినవద్దూ, చెడు కనవద్దూ, చెడు మాట్లాడొద్దూ అని చెప్పారు కాని.. చెడు అన్నా, విన్నా.. చూసినా..చేసినా చెంప చెల్లుమనిపించమని చెప్పాలిసింది..
మనిషి ఎలాగూ మారడు.
యుగాంతం వచ్చినా బాగుండేది !!.. మనిషి జాతి మొత్తం చచ్చినా బాగుండేది !!
Saturday, February 18, 2012
Saturday, February 11, 2012
Sunday, December 18, 2011
anna hazare
ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడపరా ముందుకు అటో ఎటో వైపు...
ఆ ఒక్కడే ఒక్క అడుగేసాడు.. ఆతడె సైన్యమయ్యాడు..
మేము సైతం అంటూ ఊరు, వాడా, పల్లె, పట్నం కదిలింది.
అవినీతి పై సమరానికి సై అంది..
ఇక ఈ చైతన్య రథ చక్రాలు ఆగవు..
అవినీతి నాయకుల ఆటలు ఇక సాగవు.
బాపూజి సూత్రమో, భగత్ సింగ్ మార్గమో..
ఏదో ఓకదారి..అడుగైతె పడింది..
ఈ అడుగులు గల్లీ నుంచి మొదలై.. డిల్లీ దాక చేరాయి.
'అన్నా మేమున్నాము నీ వెంట..
మీతొనైనా మార్పు రావాలి .. ఇది జనమందరి మాట ...
ఆ ఒక్కడే ఒక్క అడుగేసాడు.. ఆతడె సైన్యమయ్యాడు..
మేము సైతం అంటూ ఊరు, వాడా, పల్లె, పట్నం కదిలింది.
అవినీతి పై సమరానికి సై అంది..
ఇక ఈ చైతన్య రథ చక్రాలు ఆగవు..
అవినీతి నాయకుల ఆటలు ఇక సాగవు.
బాపూజి సూత్రమో, భగత్ సింగ్ మార్గమో..
ఏదో ఓకదారి..అడుగైతె పడింది..
ఈ అడుగులు గల్లీ నుంచి మొదలై.. డిల్లీ దాక చేరాయి.
'అన్నా మేమున్నాము నీ వెంట..
మీతొనైనా మార్పు రావాలి .. ఇది జనమందరి మాట ...
Subscribe to:
Posts (Atom)



