ఏయ్ ఎందుకంత కోపమో!
నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావో తెలుసా,బుంగ మూతిపెట్టిన చందమామలా,
ఏ పిచ్చి మొద్దు !!ఎన్నిసార్లు అడిగావో నన్ను, నేనంటే ఎంత ఇష్టం అని,
ఇప్పటిదాక నాకు పోలిక దొరకలేదు,
ఎన్నిసార్లు అడిగావో ఎందుకు ఇష్టం అని,కారణం దొరకలేదు,
కాని ఎందుకో నువ్వంటే నన్ను నేను మరిచేంత ఇష్టం.
నువ్వు అక్కడ నా ఊహల్లో, నేను ఇక్కడ నీ ఊహల్లో,ఇద్దరం కలిసే ఆ వేళ కోసం ఎంతగా నిరీక్షణ..,
కాలం ఎంత మాయదో, నువ్వు దూరంగా ఉంటే భారంగా గడుస్తుంది, చెంతనుంటే, గంటలు నిమిషాలవుతాయి..
నీ రెండు కళ్ళల్లోకి చూసినప్పుడల్లా, నాకో రూపం అందమైన రూపం కనిపిస్తుంది,
అది నువ్వు నాపైన దాచుకున్న ప్రేమ..మరి నా ప్రేమను నీకెలా చూపాలి..
ఒక్కసారి నువ్వు నేనవుతావా !! నా మనసేంటో తెలుస్తుంది
నేను గుర్తున్నానా!! అని అడుగువుతావు చూడు గారంగా,
ఆ గారంలొ ఎంత సింగారమో!
'నువ్వేమైన ఙాపకానివా.. నా జీవితానివీ అని అరువు డైలాగ్ వాడినా ఎంతగా మురిసిపొతావే పిచ్చి మొద్దు..
ఆ మురిపంలో నీ మోము ముద్ద మందారం..
ఆ వెన్నెల నన్నెలా వరించిందో,ఇన్నివన్నెల్లున్న నీ రూపంలో
ఏయ్ నిన్న రాతిరి నాకొచ్చిన కల చెప్పనా..
సాగరతీరం..చిలిపి చినుకులు, తడిసిన తనువులు
నువ్వు.. నేను ...వెండి కాంతుల్లొ మెరుస్తున్న నీ మేను,
నీ చూపులు నా కన్నుల్లోకి సూటిగా,
ఇసుకతెన్నెల్లో, నీ పాదాలు నాపాదాలపై పదాలు రాస్తుంటే,
ఓ కొత్త భాష, మన ఇద్దరికే తెలిసిన భాష..
నేను ముద్దడిగాను, నువ్వు వద్దన్నావు,
నేను ఊరుకున్నానా! సాధించుకున్నా !
ఎన్ని మధురిమలు ఆ క్షణంలో కాలం ఆగిపోవలనిపించేలా..
ఎంత బాగుందో కదా నా కల, నువ్వు ఇచ్చిన మొదటి ముద్దులా..
2 comments:
keka raasavu amith..manasulo intha vundha neeku .. enni rojuluu edo anukunnaa verey laga ....:-)
amith, chala bagundi. ne manasulo mata enta baga cheppav. chala chala bagundi. neku alanti wife ravali... vastundi. ......
Post a Comment