Sunday, June 21, 2009

మువ్వల చాటింపు

మువ్వల చాటింపు
మువ్వల చాటింపు నువ్వు వస్తున్నావని
ఎంత ఆనందమో ఆ సవ్వడి వింటే
ఏటి గట్టున గవ్వల మూట దొరికినంతగా
నువ్వున్న్నంతసేపు..
పూల వర్ష కురిసినట్టు
గాలిగంధం మోసుకోచిన్నట్టు
నీటి తెమ్మెరలు తాకినట్లు
కలువ మొగ్గ విప్పారినట్లు
నిలువెత్తు నీ చిరునవ్వువిరులు సైతం అసూయ పడేలా..

నీతొ మాట్లాడుతుంటె గడియరం ముల్లు ఓ సుపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్స్ నా గుండె వేగం కూడా.
ఏ బంధముందో అంతలా పెనవేసుకున్నావు..

మనసుకు జ్ఞాపకానికి మధ్య ఉన్న అనుబంధమో
కొమ్మకి పువ్వుకి మధ్య ఉన్న స్నేహ బంధమో..
ఏదైతేనెమీ నన్నే నాకు కొత్తగ పరిచయం చేసావు.!!

వెళ్ళిపోతావు మళ్ళొస్తానని
ఇక నిరీక్షణ ..చినుకు కొసం మయూరం లా!! వసంతం కొసం కోయిలలా ..
మెరిసే చుక్కలు ..

కురిసే చినుకులువిరిసే సుమాలు.. కూసే కోయిల
ఇన్ని అందాలున్న ఎన్నడూ స్పందనే లెదే
ఏముందో నీ స్నేహం లొ మనసంతా భావొద్వెగాల వెల్లువా..






No comments: